ఈ20 పెట్రోల్‌తో ఇంజిన్‌కు ఎలాంటి నష్టం ఉండదు: కేంద్రం
- ఈ20తో మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్న కేంద్రం
- మైలేజీపై ఇథనాల్ శాతంతో పాటు డ్రైవింగ్ తీరు, వాహనం నిర్వహణ అంశాల ప్రభావం
- ఈ20 పెట్రోల్‌తో అధిక ఆక్టేన్ విలువ, మెరుగైన దహన సామర్థ్యం వంటి ప్రయోజనాలు
ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజిన్‌లు దెబ్బతింటాయన్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ10 పెట్రోల్‌కు అనుగుణంగా రూపొందించిన కొన్ని పాత వాహనాల్లో మైలేజీ 3-5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని రాజ్యసభలో తెలిపింది.
మైలేజీపై ఇథనాల్ శాతంతో పాటు డ్రైవింగ్ తీరు, వాహనం నిర్వహణ, టైర్లలో గాలి ఒత్తిడి, వీల్ అలైన్‌మెంట్, ఏసీ వినియోగం వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని కేంద్రం పేర్కొంది. అదే సమయంలో ఈ20 పెట్రోల్‌తో అధిక ఆక్టేన్ విలువ, మెరుగైన దహన సామర్థ్యం, ఇంజిన్‌లో నాకింగ్ తగ్గడం, వాహనం సాఫీగా పికప్ తీసుకోవడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని వివరించింది.
ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ20 పెట్రోల్‌పై వస్తున్న విమర్శలను ఖండించారు. ఈ20 వల్ల ఏ ఒక్క కారు దెబ్బతిన్నట్లు ఆధారాలు లేవని, ఇలాంటి ఆరోపణలు తప్పుడు ప్రచారంలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు.