గోవాలో 'నిన్నుకోరి' సక్సెస్ పార్టీ !
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోవాలో 'నిన్నుకోరి' సక్సెస్ పార్టీ !

నాని .. నివేదా థామస్ జంటగా నటించిన 'నిన్నుకోరి' సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ రీసెంట్ గా విజయవాడలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసి థ్యాంక్స్ చెప్పింది.

ఇప్పుడు ఈ సినిమా టీమ్ సభ్యులు తమ కోసం సక్సెస్ పార్టీని 'గోవా'లో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సక్సెస్ పార్టీ కోసం 'మిడిల్ క్లాస్ అబ్బాయి' షూటింగ్ కి కూడా నాని బ్రేక్ ఇచ్చాడట. 'నిన్ను కోరి' సక్సెస్ పార్టీలో దర్శక నిర్మాతలు .. నాని .. ఆది పినిశెట్టి .. తదితరులు పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఆదివారమంతా గోవాలో సక్సెస్ పార్టీలో ఎంజాయ్ చేసే నాని, సోమవారానికి తిరిగి తన సినిమా షూటింగులో పాల్గొంటాడని అంటున్నారు.  
nani
niveda thomas

More Telugu News