అందుకే చైతూ డ్రీమ్ నిజం కాలేదట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే చైతూ డ్రీమ్ నిజం కాలేదట!

ఒక వైపున యూత్ ను .. మరో వైపున ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడం కోసం, 'రారండోయ్ వేడుక చూద్దాం'తో నాగచైతన్య చేసిన ప్రయత్నం కొంతవరకూ ఫలించిందనే చెప్పాలి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. చైతూ కొత్తగా కనిపించాడంటూ .. నటన పరంగా కూడా ఆయనకి మంచి మార్కులు తెచ్చిపెట్టింది.

అయితే, ఈ సినిమా 30 కోట్ల షేర్ ను రాబడుతుందనీ .. తనకి బ్లాక్ బస్టర్ ఇస్తుందని చైతూ ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా 28 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్ లో 2 కోట్ల లోపు షేర్ రావడం వల్లనే ఈ సినిమా 30 కోట్ల మార్క్ ను చేరుకోలేకపోయింది. ఈ కారణంగానే చైతూ డ్రీమ్ నిజం కాలేదని అంటున్నారు. నెక్స్ట్ పిక్చర్ తోనైనా ఆయన డ్రీమ్ నెరవేరుతుందేమో చూడాలి.       
nagachaitanya
rakul

More Telugu News