'పాపం ప్రతాప్' మూవీ రివ్యూ
విభిన్నమైన కథలతో సినిమాలు చేసే హీరోల్లో తిరువీర్ ఒకరు. ఇటీవల 'ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో' చిత్రంతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఈ యువ హీరో ఈ సారి 'పాపం ప్రతాప్' అనే ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే సరైన పబ్లిసిటి లేకపోవడం వల్ల 'ది గ్రేట్ ప్రీవెడ్డింగ్' అనే సినిమా ప్రేక్షకులకు చేరువ కాలేదని, దీంతో ఓ మంచి సినిమా థియేటర్‌లో సరైన కలెక్షన్లు సాధించలేదని, ప్రతి ప్రెస్‌మీట్‌లో తన అసంతృప్తిని వ్యక్తం చేసిన తిరువీర్ ఈ సారి 'పాపం ప్రతాప్'కు పబ్లిసిటిపై శ్రద్ధ పెట్టాడు.
అవకాశం దొరికిన ప్రతిసారి 'పాపం ప్రతాప్' అనే టైటిల్‌కు తగ్గట్టుగా తనపై ఆడియన్స్‌కు సింపథి కలిగేలా ఉపన్యాసాలు, ప్రశ్నలకు, సమాధానాలు ఇవ్వడంతో పాటు, రకరకాల పబ్లిసిటి క్యాంపెయిన్‌లు, ఇంటర్వ్యూల్లో పాల్గొని 'పాపం ప్రతాప్'కు ఆడియన్స్‌లో బజ్ తీసుకరావడానికి ప్రయత్నించాడు. ఇక 'పాపం ప్రతాప్' కథాంశం ఏమిటి? ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు ఈ చిత్రం వినోదాన్ని పంచిందా? లేదా? తిరువీర్ పబ్లిసిటి మంత్రం ఫలించిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
సీతారామపురంలో అనే గ్రామంలో ఉండే ప్రతాప్ (తిరువీర్)కి అదే ఊరిలో ఉండే బుబ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ) అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. స్కూల్ డేస్ నుంచే ప్రేమించిన బుజ్జమ్మకు యుక్త వయసు రాగానే తన ప్రేమను తెలియజేసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తరువాత ప్రేమ ఎలా ఉంటుందో చూద్దామని ఇద్దరూ కలిసి ఒక్కటవుతారు. అయితే మొదటి మూడు రాత్రులు గడిపిన తరువాత బుజ్జమ్మ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెడుతుంది. ప్రతాప్‌కు ఓ విచిత్రమైన సమస్య ఉందని, ఆయనతో ఉండటం ఇష్టం లేదని చెప్పి పుట్టింటికి వెళ్లిపోతుంది.
అయితే ఆ సమస్య ఏమిటో ఎవరికి చెప్పదు. ప్రతాప్‌తో మాత్రం ఆ సమస్య ఏమిటో నువ్వే తెలుసుకుని, దానిని తగ్గించుకోని వస్తే కాపురానికి వస్తానని చెబుతుంది. దీంతో బుజ్జమ్మపైనే తన పంచ ప్రాణాలు పెట్టుకున్న ప్రతాప్ ఏం చేశాడు? తన సమస్యను ఎలా తెలుసుకున్నాడు? మొదట్నుంచీ బుబ్జమ్మతో పెళ్లి ఇష్టం లేని ప్రతాప్ తండ్రి వీరయ్య ఈ సమయంలో ( అజయ్ ఘోష్) ఏం చేశాడు? అసలు ప్రతాప్ అనారోగ్య సమస్య ఏమిటి? దానిని ఎలా తగ్గించుకున్నాడు? తగ్గిందా? లేదా?, ప్రతాప్, బుజ్జమ్మలు కలిసిపోతారా? లేదా? అనేది చిత్ర కథాంశం.
ఈతరం ప్రేక్షకులు కథాంశంలో కొత్తదనం, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకే నూతన దర్శకులు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు వస్తున్నారు. అయితే కథాంశం కన్వీన్సింగ్‌గా ఉంటేనే అవి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ చిత్ర దర్శకుడు కూడా కథానాయకుడికి ఓ విచిత్రమైన సమస్యను క్రియేట్ చేసి, దాని చుట్టు వినోదాన్ని అల్లుకుని సినిమా ఆద్యంతం కొనసాగించే ప్రయత్నం చేశాడు.అయితే దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ కన్వీన్సింగ్‌గా లేకపోవడం, వినోదం కూడా పండకపోవడంతో సినిమా మొదట్నుంచే నత్తనడకన సాగుతున్న ఫీల్ కలుగుతుంది.
సినిమా ప్రారంభ సన్నివేశంలో కథ ఎక్కడ ఉందో, పతాక సన్నివేశాల వరకు కథాంశం ముందుకు కదలకుండా అక్కడే ఉన్న ఫీల్ కలిగిస్తుంది. ప్రతి సన్నివేశం రీపీటెగా చూస్తున్నామనే భావన కలుగుతుంది. ప్రతాప్‌లో ఉన్న సమస్యపై అందరిలో ఉత్సుకత కలిగించిన దర్శకుడు, ఆ సమస్య రీవీల్ చేసిన తరువాత ఊసురమనిస్తుంది. ఎందుకంటే కథానాయకుడి సమస్యపై పూర్తి క్లారిటి ఉండదు. ఇక వినోదంలో భాగంగా గోపరాజు రమణ, షకీలా సినిమాలపై పెంచుకున్న మోజు, షకీలా సినిమా టిక్కెట్ కోసం ఏకంగా తన కూతురుని ఇచ్చి పెండ్లి చేస్తానని మాట ఇవ్వడం వంటి సీన్స్ ఇబ్బందికరంగా అనిపిస్తాయి.
దీంతో పాటు హీరో, తన స్నేహితుడుతో కలిసి తన సమస్యను కనుక్కోవడానికి చేసే ప్రయత్నంలో వచ్చే సన్నివేశాలు ఇరిటేషన్ తెప్పిస్తాయి. ఆలు మగల మధ్య ఉన్న సమస్యను, భర్తపై అమితమైన ప్రేమ ఉన్న భార్య వెంటనే రచ్చబండ మీదికి తీసుకరాదు. ఇక ఈ సమస్యకు కథానాయకుడి ప్రేమకు ముడిపెట్టడం కూడా అంతగా సరిపోలేదు. ఓ చిన్న కాన్సెప్ట్‌కు, వినోదాన్ని జోడించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలన్న 'పాపం ప్రతాప్' ప్రయత్నం విఫలమైంది. ఫస్టాఫ్ భారంగా నడిస్తే... సెకండాఫ్ ప్రేక్షకుల సహనానికి మరింత పరీక్ష పెడుతుంది.
ప్రతాప్ పాత్రలో తిరువీర్ అమాయకంగా, భార్యపై ప్రేమ ఉన్న భర్తగా కనిపించిన విధానం సహజత్వం లోపించింది. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన మెప్పిస్తుంది. ప్రతాప్ తండ్రి అజయ్ ఘోష్ సినిమా ఆద్యంతం ఒకే మూడ్‌లో కనిపించాడు. పతాక సన్నివేశాల్లో హీరో తల్లిగా రాశి నటన అలరిస్తుంది. ప్రసాద్ బెహరా, గోపరాజు రమణ, రఘుబాబు దేవిప్రసాద్, ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. పాటలు ఫర్వాలేదనిపించాయి. కథకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు కనిపించాయి.
ఈ రోజుల్లో చిన్న సినిమాలకు ప్రేక్షకులు థియేటర్స్ వరకు రావాలంటే ఖచ్చితంగా వాళ్లకు థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే స్ట్రాంగ్ కంటెంట్ కావాలి. 'పాపం ప్రతాప్' ఈ విషయంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. ఏ మాత్రం ఆకట్టుకోని కథాంశంతో...సాగదీతగా ఉన్న సన్నివేశాలతో ఉన్న ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ప్రేక్షకుడు వెతుక్కోవాల్సిందే.

Movie Details
Movie Name: Papam Prathap
Release Date: 2026-04-17
Cast: Thiruveer, Payal Radhakrishna, Raashi, Ajay Ghosh, Srinivas Avasarala, Raghu Babu, Goparaju Ramana, Devi Prasad, Ravi Anthony, Prasad Behara, Ananth Babu, Basha
Director: S.p. Durga Naresh
Producer: Gaddam Rakesh Reddy, Rudradev Madhi Reddy
Music: K. M. Radhakrishna
Banner: ETV Win, Krushi Entertainments
Review By: Maduri Madhu
Trailer