నా పిల్లలు ఇక్కడే పుట్టారు.. నేను సగం భారతీయుడ్ని: జాంటీ రోడ్స్
- తన ఇద్దరు పిల్లలు భారత్‌లోనే జన్మించారని వెల్లడి
- చెన్నైలో సోలార్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైనం
- ఐపీఎల్ యువకులను ఉత్తమ ఫీల్డర్లుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్న రోడ్స్
- పునరుత్పాదక ఇంధనం భవిష్యత్ తరాలకు అత్యవసరమని స్పష్టం
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఫీల్డింగ్ మాంత్రికుడు జాంటీ రోడ్స్ మరోసారి భారత్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాను సగం భారతీయుడినని, సగం దక్షిణాఫ్రికా వాడినని వ్యాఖ్యానించాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రోడ్స్, భారత్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.
దశాబ్దాలుగా భారత్‌తో జాంటీ రోడ్స్‌కు విడదీయరాని బంధం ఉంది. ఐపీఎల్ సందర్భంగా 2015-2017 మధ్య తన ఇద్దరు పిల్లలు ముంబైలోనే జన్మించారని రోడ్స్ తెలిపాడు. తన కుమార్తెకు 'ఇండియా' అని పేరు పెట్టుకోవడం విశేషం. చెన్నై సమీపంలోని మహాబలిపురం, గోవాలలో తన కుటుంబంతో కలిసి ఏడాదిలో దాదాపు ఆరు నెలల పాటు గడుపుతానని రోడ్స్ వివరించాడు.
చెన్నైలో 'ఎవాల్వ్ ఎనర్జీ గ్రూప్' ఏర్పాటు చేసిన సోలార్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవానికి జాంటీ రోడ్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సంస్థకు రోడ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "1992 ప్రపంచకప్‌లో ఇంజమామ్-ఉల్-హక్‌ను రనౌట్ చేయడమే నా ఫీల్డింగ్ ఘనత అని చాలామంది అంటారు. కానీ, ఐపీఎల్‌లోని యువ ఆటగాళ్లను నా కన్నా ఉత్తమ ఫీల్డర్లుగా తీర్చిదిద్దడమే నా అసలైన లక్ష్యం" అని అన్నాడు.
భవిష్యత్ తరాల కోసం పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రోడ్స్ నొక్కిచెప్పాడు. చాలామంది దీని గురించి మాట్లాడతారే కానీ, ఆచరణలో పెట్టరని, ఎవాల్వ్ ఎనర్జీ వంటి సంస్థలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని కొనియాడాడు. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ద్వారా సామాన్యులకు కూడా సోలార్ ఎనర్జీపై అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డాడు.