గంగానదిలో బోటు మునక.. 8 మంది చిన్నారులు సహా 11 మంది మృతి
- బిహార్లోని వైశాలి జిల్లాలో ఘటన
- విందు కోసం వెళ్తుండగా విషాదం
- మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా
బిహార్లోని వైశాలి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ బోల్తా పడటంతో 8 మంది చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాఘోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్పూర్ శ్యామ్చంద్ గ్రామ సమీపంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. బాధితులంతా ఒక విందు కార్యక్రమానికి హాజరయ్యేందుకు పడవలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో పడవలో సుమారు 15 నుంచి 20 మంది వరకు ఉన్నట్టు తెలిసింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికార యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించాయి. రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పలువురిని కాపాడి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని వైశాలి జిల్లా మేజిస్ట్రేట్ వర్షా సింగ్ తెలిపారు.
ఈ దురదృష్టకర ఘటనపై ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.