పల్నాడులో విషాదం .. ఉరివేసుకుని తండ్రి కూతురు దుర్మరణం
- రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో ఘటన
- కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొనుగుంట్ల పోతులూరయ్య (60), ఆయన కుమార్తె రామాజమ్మ (39) తమ ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. వీరిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
కొంతకాలంగా కుటుంబంలో నెలకొన్న వివాదాలు, వ్యక్తిగత సమస్యల కారణంగానే వారు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు బంధువులు, గ్రామస్థులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ విషాదకర సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.