బ్రిటన్ తొలి బిలియనీర్ క్రీడాకారుడిగా డేవిడ్ బెక్‌హామ్.. సంపద విలువ రూ. 12,800 కోట్లు!
- బ్రిటన్‌లో తొలి బిలియనీర్ క్రీడాకారుడిగా డేవిడ్ బెక్‌హామ్
- భార్య విక్టోరియాతో కలిసి రూ. 12,800 కోట్లకు చేరిన సంపద
- ఇంటర్ మయామి క్లబ్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు ప్రధాన ఆదాయ వనరులు
- మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమాని జిమ్ రాట్‌క్లిఫ్ సంపదలో భారీ తగ్గుదల
- సండే టైమ్స్ స్పోర్ట్స్ రిచ్ లిస్ట్‌లో వెల్లడైన వివరాలు
ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్, మాజీ మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ అరుదైన ఘనత సాధించాడు. బ్రిటన్‌లో తొలి బిలియనీర్ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. సండే టైమ్స్ 2026 రిచ్ లిస్ట్ ప్రకారం, బెక్‌హామ్, ఆయన భార్య విక్టోరియా సంయుక్త సంపద భారత కరెన్సీలో సుమారు రూ. 12,800 కోట్లకు (1.185 బిలియన్ పౌండ్లు) చేరింది. దీంతో క్రీడా రంగంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఈ జంట రెండో స్థానంలో నిలిచింది.
అమెరికా మేజర్ లీగ్ సాకర్‌లో అత్యంత విలువైన క్లబ్‌గా పేరొందిన ఇంటర్ మయామికి బెక్‌హామ్ సహ యజమానిగా ఉన్నాడు. ఈ క్లబ్ విలువ సుమారు రూ. 12,000 కోట్లుగా (1.45 బిలియన్ డాలర్లు) ఉంది. దీంతో పాటు అడిడాస్, హ్యూగో బాస్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసడర్‌గా వ్యవహరిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఆయన భార్య విక్టోరియా బెక్హామ్ ఒకప్పటి స్పైస్ గాళ్స్ మ్యూజిక్ బ్యాండ్ సభ్యురాలు. ఆమె తన ఫ్యాషన్ లేబుల్ ద్వారా భారీగా సంపదను ఆర్జించారు.
ఒకవైపు బెక్‌హామ్ సంపద పెరుగుతుంటే, మరోవైపు మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమాని సర్ జిమ్ రాట్‌క్లిఫ్ ఆస్తి గతేడాది కాలంలో గణనీయంగా తగ్గింది. ఆయన సంపద సుమారు రూ. 20,000 కోట్లు (1.85 బిలియన్ పౌండ్లు) తగ్గి, దాదాపు రూ. 1.64 లక్షల కోట్లకు చేరింది. ఆయనకు చెందిన ఇనియోస్ పెట్రోకెమికల్స్ కంపెనీ నష్టాల పాలవడం ఇందుకు ప్రధాన కారణంగా తేలింది.
ఈ స్పోర్ట్స్ రిచ్ లిస్ట్‌లో ఫార్ములా వన్ మాజీ చీఫ్ బెర్నీ ఎక్లెస్టోన్ కుటుంబం రూ. 21,600 కోట్ల సంపదతో అగ్రస్థానంలో ఉంది. ఇతర ప్రముఖులలో ఎఫ్1 ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ (రూ. 4,698 కోట్లు), గోల్ఫ్ స్టార్ రోరీ మెక్‌ఇల్రాయ్ (రూ. 3,510 కోట్లు), ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ కెప్టెన్ హ్యారీ కేన్ (రూ. 1,188 కోట్లు) ఉన్నారు.