ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చాలా గొప్ప నాయకుడు, కానీ!: కవిత ఆసక్తికర వ్యాఖ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చాలా గొప్ప నాయకుడు, కానీ!: కవిత ఆసక్తికర వ్యాఖ్య

K Kavitha Interesting Comments KCR is a Great Leader but
  • కేసీఆర్ సీఎం అయ్యాక ప్రజలకు దూరమయ్యారన్న కవిత
  • పరిపాలన కాలంలో కేసీఆర్ యంత్రంలా పని చేశారని వ్యాఖ్య
  • అందుకే ఆయనకు ప్రజల భావోద్వేగాలు అర్థం కాలేదన్న కవిత
ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని, అందులో ఎవరికీ అనుమానాలు లేవని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు క్రమంగా దూరమయ్యారని అన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పరిపాలన కాలంలో కేసీఆర్ ఒక యంత్రంలా మాత్రమే పనిచేశారని అన్నారు. అందువల్లే ఆయనకు ప్రజల భావోద్వేగాలు అర్థం కాలేదని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఆయన ఎంతో కఠినంగా ఉండేవారని అన్నారు. కన్నబిడ్డగా సమస్యలు చెప్పుకునే అవకాశం తనకే ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకే అందుబాటులో లేని వ్యక్తి, ఇక సామాన్య ప్రజల కష్టాలను ఎలా వింటారని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడి నుంచి ఒక యంత్రం లాంటి ముఖ్యమంత్రిగా మారిన తీరే ప్రస్తుత రాజకీయ పరిణామాలకు కారణమని అన్నారు.
Advertisement
K Kavitha
KCR
KCR criticism
BRS party
Telangana politics
Telangana Rakshana Sena
Telangana CM

More Telugu News