ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
- పలు జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్ల నియామకం
- ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా పలువురికి కొత్త బాధ్యతలు
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ
ఇప్పటివరకు పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న వైఖోమ్ నిడియా దేవి (2021 బ్యాచ్)ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. రంపచోడవరం సబ్-కలెక్టర్‌గా ఉన్న శుభమ్ నోఖ్వాల్ (2023 బ్యాచ్)ను చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. అలాగే చింతూరు సబ్-కలెక్టర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం సబ్-కలెక్టర్ వైశాలి ఆర్‌ను (2023 బ్యాచ్) అదే ప్రాంత ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా నియమించారు. కొత్త ఆర్డీవో నియామకం జరిగే వరకు ఆమె పార్వతీపురం సబ్-కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇక రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేసిన బాచు స్మరణ్ రాజ్ (2022 బ్యాచ్)ను బదిలీ చేసి, సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.