Donald Trump: అమెరికాలో పుట్టినంత మాత్రాన పౌరసత్వం రాదా?.. యూఎస్ సుప్రీంకోర్టులో తీవ్ర చర్చ
అమెరికాలో పుట్టుకతో పౌరసత్వం ఇచ్చే విధానాన్ని మార్చాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో అమెరికన్ ఇండియన్లు (స్థానిక ఆదివాసీ తెగలు) చర్చనీయాంశంగా మారారు. పాత రాజ్యాంగ సూత్రాలు నేటి వలస విధానాలకు ఎలా వర్తిస్తాయన్న దానిపై న్యాయవాదులు వాడివేడిగా వాదనలు వినిపించారు.
బుధవారం జరిగిన విచారణలో ట్రంప్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ జాన్ సావర్ వాదనలు వినిపించారు. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో 14వ రాజ్యాంగ సవరణను రూపొందించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు ఉదాహరణగా, ఆ సవరణ అమల్లోకి వచ్చినప్పుడు అమెరికన్ ఇండియన్ తెగలకు చెందిన పిల్లలకు పౌరసత్వం లభించలేదని ఆయన గుర్తు చేశారు. అమెరికా గడ్డపై పుట్టినంత మాత్రాన పౌరసత్వం రాదని, వారు పూర్తిగా అమెరికా అధికార పరిధిలోకి వస్తారా? లేదా? అన్నదే ముఖ్యమని ఆయన వాదించారు. చారిత్రకంగా స్థానిక తెగలు ప్రత్యేక రాజకీయ సమూహాలుగా ఉన్నాయని, అవి తమ సొంత ప్రభుత్వాలకు లోబడి ఉండేవని పేర్కొన్నారు.
అయితే, ప్రభుత్వ వాదనను ప్రత్యర్థుల తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. స్థానిక తెగల మినహాయింపు చాలా ప్రత్యేకమైనదని, దానిని వలసదారులకు వర్తింపజేయలేరని వాదించారు. స్థానిక తెగలు అమెరికాలో ఉన్నప్పటికీ మరో సార్వభౌమ అధికార పరిధిలో ఉంటాయని, కానీ విదేశీయుల విషయంలో అలా కాదని స్పష్టం చేశారు.
చారిత్రకంగా, అమెరికా భూభాగంలో జన్మించినప్పటికీ స్థానిక ఇండియన్ తెగలకు పుట్టుకతో పౌరసత్వం దక్కలేదు. 1924లో కాంగ్రెస్ ఒక ప్రత్యేక చట్టం ద్వారా వారికి పౌరసత్వాన్ని మంజూరు చేసింది. బానిసత్వ విముక్తి పొందిన వారికి పౌరసత్వం కల్పించడం, అదే సమయంలో స్థానిక తెగల ప్రత్యేక హోదాను కాపాడటం అనే రెండు ప్రధాన ఉద్దేశాలతో 14వ సవరణను రూపొందించారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఒకప్పుడు కేవలం స్థానిక తెగల కోసం ఇచ్చిన ఈ చిన్న మినహాయింపును ఆధారం చేసుకుని, నేడు పుట్టుకతో పౌరసత్వంపై విస్తృత పరిమితులు విధించవచ్చా? లేదా? అన్నది సుప్రీంకోర్టు తీర్పుతో తేలనుంది.