TatiParthi Chandrasekhar: అసెంబ్లీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు: వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి
- అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందన్న తాటిపర్తి
- కూటమి నేతలు సూపర్ స్కామ్ లకు పాల్పడుతున్నారని ఆరోపణ
- తిరుమల పవిత్రతను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపాటు
అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం వాస్తవ విరుద్ధమైన 'కాకి లెక్కలు' చెబుతూ కాలయాపన చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేయమంటే, కూటమి నేతలు 'సూపర్ స్కామ్'లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిందని పేర్కొన్నారు.
అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం దురదృష్టకరమని, అటు మండలి చైర్మన్‌ను మతం పేరుతో అవమానించడం అత్యంత హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదంపై చర్చ జరిగితే తమ తప్పులు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. తిరుమల పవిత్రతను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ గురించి అడిగితే మంత్రి లోకేశ్ కేవలం తేదీలు మారుస్తూ యువతను వంచిస్తున్నారని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.