దుబాయ్‌లో విష్ణు కుటుంబం సేఫ్‌గా ఉండాలని ప్రార్థిస్తున్నాను: మంచు లక్ష్మి
- దుబాయ్‌లో మంచు విష్ణు కుటుంబం
- యుద్ధం ముదిరిన వేళ సోదరుడి కోసం మంచు లక్ష్మి ఆవేదన
- ఇప్పటికే ఓ వీడియో పంచుకున్న మంచు విష్ణు
దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేత, క్షిపణి దాడుల వార్తల నేపథ్యంలో మంచు లక్ష్మి స్పందిస్తూ.. "విష్ణు, ఆయన అందమైన కుటుంబం దుబాయ్‌లో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. కష్టకాలంలో మన సొంత వాళ్ళు ఆపదలో ఉంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. మిమ్మల్ని నా గుండెల్లో హత్తుకుంటున్నాను. దేవుడి దయ మీ చుట్టూ ఉండాలి. ప్రేమ మాత్రమే గెలుస్తుంది" అని ట్వీట్ చేశారు.
కాగా, దుబాయ్ గగనతలంలో డ్రోన్లను ఇంటర్‌సెప్టర్లు అడ్డుకుంటున్న వీడియోను మంచు విష్ణు ఇప్పటికే షేర్ చేశారు. తాము తీవ్ర భయాందోళనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రతీకార దాడుల వల్ల దుబాయ్ ఎయిర్‌పోర్టుకు పాక్షిక నష్టం వాటిల్లింది. దాంతో ఈ విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తన తమ్ముడు సేఫ్‌గా ఇంటికి తిరిగి రావాలని మంచు లక్ష్మి ఆకాంక్షించారు.