Kamal Haasan: కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీకి టార్చ్‌లైట్ గుర్తు

Kamal Haasan MNM Party Gets Torch Light Symbol
  • బ్యాటరీ టార్చ్‌లైట్ గుర్తును కేటాయిస్తూ ఈసీ నోటిఫికేషన్
  • పుదుచ్చేరి ఎన్నికల్లో టార్చ్‌లైట్ గుర్తుతో పోటీ
  • తమిళనాడు ఎన్నికల కోసం ఇంతకుముందే టార్చ్‌లైట్ గుర్తు కేటాయింపు
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ 'మక్కల్ నీది మయ్యం' (ఎంఎన్ఎఎం) రాబోయే పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం భారత ఎన్నికల సంఘం బ్యాటరీ టార్చ్‌లైట్ గుర్తును కేటాయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీ టార్చ్‌లైట్ గుర్తుతో బరిలోకి దిగనుంది.

తమకు టార్చ్‌లైట్ గుర్తు వచ్చిందని, ఈ గుర్తుపై పుదుచ్చేరిలో పోటీ చేస్తామని పార్టీ ఎంఎన్ఎం పార్టీ మీడియా విభాగం ప్రకటించింది. తమిళనాడులో జరగనున్న ఎన్నికల కోసం ఇంతకుముందే టార్చ్‌లైట్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.

ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుర్తింపుపొందని రాజకీయ పార్టీలు గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ ఇటీవల కోరిన విషయం తెలిసిందే. దీనితో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎంఎన్ఎం పార్టీ పది చిహ్నాలు ఉన్న జాబితాను అందించి, వాటిలో ఒకదానిని కేటాయించాలని కోరింది.
Kamal Haasan
Makkal Needhi Maiam
MNM Party
Puducherry Elections
Torch Light Symbol
Election Commission of India

More Telugu News