బెంగళూరులోనూ ఏఎంబీ సినిమాస్... ప్రారంభోత్సవ తేదీ ప్రకటించిన మహేశ్ బాబు
- బెంగళూరులో ఏఎంబీ సినిమాస్
- సౌత్ ఇండియాలోనే తొలి డాల్బీ ఎక్స్‌పీరియన్స్!
- హైదరాబాద్ తర్వాత బెంగళూరులో ఏఎంబీ సినిమాస్ విస్తరణ
- జనవరి 16న అధికారికంగా ప్రారంభం కానున్న మల్టీప్లెక్స్
ఈ విషయాన్ని మహేశ్ బాబు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. "జనవరి 16న బెంగళూరులో ఏఎంబీ సినిమాస్ తలుపులు అధికారికంగా తెరుచుకోనున్నాయి సౌత్ ఇండియాలోనే తొలి డాల్బీ సినిమా అనుభూతిని ఇక్కడ అందించబోతున్నాం. దీనిని సాకారం చేసేందుకు అసాధారణమైన కృషి చేసిన టీమ్ ఏఎంబీకి నా అభినందనలు. త్వరలోనే 'నమ్మ బెంగళూరు'లో అందరినీ కలుస్తాను" అని తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏషియన్ సినిమాస్‌తో కలిసి మహేశ్ బాబు ఏర్పాటు చేసిన ఏఎంబీ సినిమాస్, అత్యుత్తమ థియేటర్ అనుభూతికి చిరునామాగా నిలిచింది. ఇప్పుడు బెంగళూరులోనూ అదే స్థాయిలో ప్రపంచస్థాయి సినిమా వీక్షణ అనుభూతిని అందించేందుకు సిద్ధమవ్వడంతో అక్కడి సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.