Al-Falah University: ఢిల్లీ కారు బాంబు.. ఆల్ ఫలా విశ్వవిద్యాలయం నుంచి 10 మంది మిస్సింగ్?

Al Falah University 10 Missing After Delhi Car Bomb Blast
  • నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు
  • కనిపించకుండా పోయిన వ్యక్తుల ఫోన్లు స్విచ్చాఫ్ అని వస్తున్నట్లు వెల్లడి
  • ఇందులో ముగ్గురు కశ్మీరీలు ఉన్నట్లు వార్తలు
ఢిల్లీ కారు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలా విశ్వవిద్యాలయం వ్యవహారాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు 10 మంది కనిపించకుండా పోయినట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కనిపించకుండా పోయిన వ్యక్తుల ఫోన్‌లు స్విచ్ఛాఫ్ అని వస్తున్నాయి. ఇందులో ముగ్గురు కశ్మీరీలు ఉన్నారని తెలుస్తోంది.

ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్ కేసులో అరెస్టైన నిందితులకు ఈ విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్నట్లు విచారణలో బయటపడింది. తాజాగా, పదిమంది కనిపించకుండా పోవడం గమనార్హం.

విశ్వవిద్యాలయం నుంచి కనిపించకుండా పోయిన వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని, వీరిలో ముగ్గురు కశ్మీరీ వాసులు ఉన్నారని నిఘా వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. ఢిల్లీలోని పేలుడు ఘటనతో ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్‌తో వీరికి సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, ఢిల్లీ కారు పేలుడు కేసులో ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు వైద్యులు సహా తొమ్మిది మంది అరెస్టయ్యారు.
Al-Falah University
Delhi car bomb
Al-Falah University missing students
Faridabad terror network

More Telugu News