అనంతపురంలో టీడీపీ మహిళా నేత తేజస్విని కారు ధ్వంసం
- పార్క్ చేసిన కారుపై రాళ్లతో దాడి చేసిన దుండగులు
- ఇది వైసీపీ కార్యకర్తల పనేనని తేజస్విని ఆరోపణ
- రాజకీయంగా ఎదుర్కోలేక దాడులంటూ ఆగ్రహం
ఈ దాడిపై తేజస్విని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ప్రత్యర్థులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది వైసీపీ కార్యకర్తల పనేనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. "ఒక ఆడబిడ్డపై ఇంత దౌర్జన్యానికి పాల్పడతారా?" అని ఆమె ఆవేదన చెందారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి దాడి చేయాలని, ఇలాంటి దొంగ దాడులు సరికాదని సవాల్ విసిరారు.
తేజస్విని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, గతంలోనూ తేజస్విని కారుపై ఇలాంటి దాడే జరగడం గమనార్హం.