ఎర్రకోట పేలుళ్ల సూత్రధారులను వదిలిపెట్టం: భూటాన్ నుంచి మోదీ హెచ్చరిక
- ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారులో భారీ పేలుడు
- భూటాన్ పర్యటన నుంచే తీవ్రంగా స్పందించిన ప్రధాని
- బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని భరోసా
ఢిల్లీ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చానని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. "నిన్న సాయంత్రం జరిగిన ఈ భయానక ఘటన అందరినీ విషాదంలోకి నెట్టింది. బాధిత కుటుంబాల దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలను. ఈ కష్ట సమయంలో యావత్ దేశం వారికి అండగా నిలుస్తుంది" అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో తాను రాత్రంతా టచ్‌లోనే ఉన్నానని ప్రధాని వెల్లడించారు.