ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం ఎఫెక్ట్... టారిఫ్‌పై చైనా కీలక నిర్ణయం
- అమెరికా వస్తువులపై ఉన్న అదనపు 24 శాతం సుంకాల సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు చైనా ప్రకటన
- ఈ పొడిగింపు ఏడాది పాటు అమలులో ఉంటుందని వెల్లడి
- పది శాతం టారిఫ్ మాత్రం కొనసాగతుందన్న చైనా
గత నెల చివరలో దక్షిణ కొరియా వేదికగా జరిగిన ట్రంప్, జిన్‌పింగ్ భేటీ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత ట్రంప్ మాట్లాడుతూ, ఆ భేటీ అద్భుతంగా జరిగిందని, సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఫెంటానిల్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల రవాణాను అడ్డుకునేందుకు జిన్‌పింగ్ కృషి చేస్తారని విశ్వసిస్తున్నానని, అందుకే ఫెంటానిల్ సుంకాలను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.