Punnanapalem: 200 ఏళ్లుగా దీపావళికి దూరంగా ఉంటున్న ఏపీలోని గ్రామం.. కారణం ఇదే!

Punnanapalem Village Andhra Pradesh Avoids Diwali for 200 Years
షార్ట్స్‌లో చూడండి
దేశమంతా దీపావళి వెలుగులతో కళకళలాడుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామం మాత్రం రెండు శతాబ్దాలుగా ఈ పండుగకు దూరంగా ఉంటోంది. దీపావళి రోజున ఆ ఊరంతా చీకట్లోనే మగ్గిపోతుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పున్నానపాలెం గ్రామస్థులు గత 200 ఏళ్లుగా దీపావళి సంబరాలు జరుపుకోవడం లేదు. దీని వెనుక ఓ తీవ్రమైన విషాద గాథ ఉంది.

వివరాల్లోకి వెళితే, సుమారు 200 ఏళ్ల క్రితం దీపావళి పండుగ రోజున పున్నానపాలెం గ్రామంలో ఊహించని దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ ఇంట్లో ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారిని పాము కాటేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అదే రోజున గ్రామానికి చెందిన మరో రైతు ఇంట్లో రెండు ఎద్దులు కూడా అకస్మాత్తుగా మరణించాయి. ఒకే రోజు జరిగిన ఈ వరుస విషాదాలతో గ్రామస్థులు తీవ్రంగా కలత చెందారు.

ఈ ఘటనలతో దిగ్భ్రాంతికి గురైన గ్రామ పెద్దలు, దీపావళి పండుగ తమ గ్రామానికి అచ్చిరాలేదని భావించారు. భవిష్యత్తులో ఇలాంటి అపశకునాలు పునరావృతం కాకూడదని భావించి, గ్రామంలో ఎవరూ దీపావళి పండుగను జరుపుకోకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ రోజు నుంచి ఈ కట్టుబాటును గ్రామస్థులు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు.

తమ పూర్వీకులు విధించిన ఆ కట్టుబాటును నేటి తరం కూడా గౌరవిస్తూ, దీపావళి పండుగకు దూరంగా ఉంటోంది. పండుగ రోజున టపాసులు కాల్చడం గానీ, ఇళ్లకు దీపాలు అలంకరించుకోవడం గానీ చేయరు. ఆ రోజున పున్నానపాలెం గ్రామం ప్రశాంతంగా, నిశ్శబ్ద వాతావరణంలో ఉంటుంది. తరాలు మారుతున్నా, తమ పూర్వీకుల మాటను గౌరవిస్తూ ఈ వింత ఆచారాన్ని కొనసాగించడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. 
Go Back to Shorts
Punnanapalem
Punnanapalem village
Srikakulam district
Andhra Pradesh
Deepavali
Diwali
Indian traditions
village traditions
no Diwali celebration
rana sthalam

More Telugu News