దేశం కోసం అవసరమైతే మేం సరిహద్దులు దాటుతాం: రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
- జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్
- దేశానికి ముప్పు పొంచి ఉంటే ఎలాంటి నిర్ణయాత్మక చర్యలకైనా దిగుతామని హెచ్చరిక
- మతం ఆధారంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించలేదని వ్యాఖ్య
దేశానికి ముప్పు వాటిల్లితే ఎలాంటి నిర్ణయాత్మక చర్యలకైనా వెనుకాడబోమని 'ఆపరేషన్ సిందూర్' ద్వారా నిరూపించామని ఆయన అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడులను కూడా ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.
పహల్గామ్‌లో ఉగ్రవాదులు పౌరులను వారి మతం ఆధారంగా కాల్చి చంపారని, అయితే భారత్ మాత్రం మతం కోణంలో 'ఆపరేషన్ సిందూర్' చేపట్టలేదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులను, వారి స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. పాకిస్థాన్ లేదా పీవోకేలో ఏ సైనిక లేదా పౌర సంస్థలపైనా భారత్ దాడి చేయలేదని గుర్తు చేశారు.