బాలకృష్ణ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తారు: గుడివాడ అమర్నాథ్
- రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డిని కలిసిన అమర్నాథ్
- పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారని విమర్శ
- జైల్లో మిథున్ రెడ్డి ధైర్యంగా ఉన్నారని వెల్లడి
"రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలతో చెలరేగిన దుమారాన్ని పక్కదారి పట్టించడానికి మరో వైసీపీ నేత ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తారు" అని అమర్నాథ్ ఆరోపించారు. గతంలో కల్తీ లడ్డూ అన్నారని, ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటున్నారని, కానీ ఎక్కడా తమపై అభియోగాలను నిరూపించలేకపోతున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. జైల్లో మిథున్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని, ఇలాంటి కుట్రలను, అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారని తెలిపారు. మిథున్ రెడ్డికి ఉత్తరాంధ్ర వైసీపీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.