Advertisement

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

Jammu and Kashmir terror attack Head Constable killed
  • అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదుల కాల్పులు
  • అమర్‌నాథ్‌ యాత్ర భద్రతా విధుల్లో ఉన్న పోలీసులపై దాడి
  • ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ ఆశిక్ హుస్సేన్ ఖురేషీ మృతి
  • ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్న భద్రతా బలగాలు
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో బుధవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. అమర్‌నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్న పోలీసు బృందంపై మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో లాల్‌చౌక్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది.

కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ ఆశిక్ హుస్సేన్ ఖురేషీని వెంటనే అనంత్‌నాగ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటన అనంతరం భద్రతా బలగాలు పరిసర ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
Advertisement
Ashiq Hussain Qureshi
Jammu and Kashmir terror attack
Anantnag shooting
Amarnath Yatra security
Jammu and Kashmir Police
Terrorists attack in Lal Chowk

More Telugu News