నాపై విశ్వాసంతో అవకాశం కల్పించారు: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
- కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన మాగంటి సునీత
- ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఉండాలని ఆశించిన మాగంటి సునీత
- త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల
ఇటీవల మృతి చెందిన మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు బీఆర్ఎస్ టిక్కెట్ కేటాయించింది. కేసీఆర్ నిర్ణయం మేరకు పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించింది. అనారోగ్య కారణాలతో గోపీనాథ్ జూన్ 8న కన్నుమూశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం త్వరలో విడుదల చేయనుంది.