ఒకే గ్రౌండ్ లో టీమిండియా, పాక్ జట్ల ప్రాక్టీస్
––
ఒకే మైదానంలో ఇరుజట్లు ప్రాక్టీస్ చేశాయి. దుబాయ్ వేదికగా ఈ రోజు పాకిస్థాన్ జట్టు యూఏఈ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యేందుకు మంగళవారం పాక్ ఆటగాళ్లు దుబాయ్ మైదానానికి చేరుకున్నారు. అప్పటికే మైదానంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, పాక్ ఆటగాళ్లు తమకు కేటాయించిన నెట్స్ లో ప్రాక్టీస్ చేశారు. ఇరు జట్ల హెడ్ కోచ్ లు గౌతమ్ గంభీర్, మైక్ హెస్సెన్ అక్కడే ఉండి తమ జట్లను పర్యవేక్షించారు.