ఖైరతాబాద్ గణేశుడి వద్ద మొదలైన భక్తుల సందడి.. గవర్నర్ తొలిపూజ
ఆనవాయితీ ప్రకారం ఖైరతాబాద్ మహా గణపతికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలిపూజ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు.