ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ భద్రత
- ఈ రోజు ఉదయం సీఎం నివాసానికి చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు
- 24 గంటలూ రక్షణ కల్పించేందుకు అదనపు బలగాల మోహరింపు
- సీఎంపై దాడి ఘటనను సీరియస్ గా పరిగణించిన కేంద్రం
జెడ్ కేటగిరీ భద్రతలో 20 మందికి పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనాలను ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సమకూర్చారు. కాగా, బుధవారం ఉదయం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ‘జన్ సున్ వాయి’ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆమెపై దాడి జరిగిన విషయం తెలిసిందే. తన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినట్లు నటించిన ఓ వ్యక్తి ఆమె చెంపపై కొట్టాడు. వెంటనే స్పందించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఎంను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.