ఖజానా జ్యువెలరీ చోరీ కేసు.. ముగ్గురు నిందితుల అరెస్టు
- ఈనెల 12న చందానగర్ ఖజానా జ్యువెలరీలో దుండగుల దోపిడీ
- జ్యువెలరీలో సిబ్బందిని తుపాకీతో బెదిరించి చోరీ, పరారీ
- నిందితుల్లో పుణెలో ఒకరిని, బీదర్‌లో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
నెల రోజుల క్రితం బిహార్ నుంచి నగరానికి వచ్చిన దొంగల ముఠా జగద్గిరి గుట్టలో మకాం వేశారు. అక్కడ ఓ గ్లాసు పరిశ్రమలో పనికి కుదిరారు. కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో ఈ నెల 12న ఆయుధాలతో వెళ్లి, జ్యువెలరీ సిబ్బందిని బెదిరించి చోరీ చేసిన అనంతరం పరారయ్యారు. ఈ దోపిడీ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు.