ఎయిరిండియాకు డీజీసీఏ నాలుగు షోకాజ్ నోటీసులు
- విమానాల్లో భద్రత, సిబ్బంది వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తోన్న డీజీసీఏ
- ఇందులో భాగంగా ఎయిరిండియాకు నాలుగు నోటీసులు
- గత ఆరు నెలల కాలంలో తొమ్మిది నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించిన పౌరవిమానయాన శాఖ
క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి, శిక్షణ నిబంధనలు, నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగినట్లు ఎయిరిండియా అంగీకరించినట్లు సమాచారం.
భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి గత ఆరు నెలల్లో ఎయిరిండియాకు డీజీసీఏ తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పౌర విమానయాన శాఖ ఇటీవల రాజ్యసభకు తెలియజేసింది. ఉల్లంఘనలకు సంబంధించి తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.