తెలంగాణ జాగృతికి కొత్త సారథి.. మాధవికి బాధ్యతలు అప్పగించిన కవిత
- రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి
- ఫౌండర్ ఛైర్‌పర్సన్‌గా కొనసాగనున్న కవిత
- నియామక ఉత్తర్వులు జారీ
- 2006లో తెలంగాణ జాగృతి స్థాపన
- బతుకమ్మకు ప్రపంచవ్యాప్త గుర్తింపులో కీలక పాత్ర
- కొత్త నాయకత్వంపై కవిత ఆశాభావం
తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ జాగృతి సంస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా సంస్థను నడిపించిన కల్వకుంట్ల కవిత ఇకపై ఫౌండర్ ఛైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలి బాధ్యతలను మారిపల్లి మాధవికి అప్పగించారు. సంస్థ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయమని చెబుతున్న నాయకత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, సాంస్కృతిక పరిరక్షణ లక్ష్యాలతో ముందుకు సాగుతామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
మారిపల్లి మాధవిని నియమిస్తూ కవిత సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొత్త నాయకత్వంలో జాగృతి మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం, ఆత్మగౌరవ పరిరక్షణే జాగృతి ప్రధాన లక్ష్యమని కవిత పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో 2006లో ఈ సంస్థను స్థాపించినట్లు గుర్తు చేశారు. ఉద్యమానికి సాంస్కృతిక బలం చేకూర్చడంలో జాగృతి కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ ప్రత్యేకతను దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు సంస్థ నిరంతరం కృషి చేసిందని చెప్పారు. అదే స్ఫూర్తితో ముందుకూ ప్రయాణం కొనసాగుతుందని వెల్లడించారు.
తెలంగాణ పల్లెలకే పరిమితమైన బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో జాగృతి విశేష కృషి చేసిందని కవిత పేర్కొన్నారు. బతుకమ్మ ఉత్సవాల ద్వారా మహిళలను పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేసిన ఘనత ఈ సంస్థకే దక్కుతుందన్నారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు నిరంతరం పనిచేసిందని వివరించారు.