రాష్ట్రపతి భవన్‌లో మంచు విష్ణు 'కన్నప్ప' చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- మంచు విష్ణు నటనను కొనియాడిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు
- ప్రత్యేక ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేసిన చిత్ర బృందం
- భక్తి కథ, సాంస్కృతిక ప్రాముఖ్యానికి దక్కిన గుర్తింపు అన్న చిత్ర బృందం
శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది. ముకేశ్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. విష్ణు నటన, ఎమోషన్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్, శివపార్వతులుగా అక్షయ్ కుమార్ - కాజల్, కిరాతుడిగా మోహన్ లాల్ తమ నటనతో అలరించారు.