వైసీపీకి గొడ్డలి గుర్తును కేటాయించండి: పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్
- పార్టీకి గొడ్డలి గుర్తు కేటాయించాలని ఈసీకి శివకుమార్ లేఖ
- గుర్తు మార్చాలని తాను ఏకగ్రీవంగా నిర్ణయించానని వెల్లడి
- వీలైనంత త్వరగా గుర్తును మార్చాలని ఈసీకి విన్నపం
1968 ఎన్నికల చిహ్నాల ఆర్డర్ ప్రకారం సంబంధిత నియమాలు, విధానాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా గొడ్డలిని తమ పార్టీ చిహ్నంగా కేటాయించాలని కోరుతున్నానని శివకుమార్ లేఖలో పేర్కొన్నారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానాలు, డాక్యుమెంట్లు, అఫిడవిట్లు లేఖకు జత చేశామని తెలిపారు. మీ సానుకూల పరిశీలన కోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈసీకి శివకుమార్ రాసిన లేఖ ఏపీలో చర్చనీయాంశంగా మారింది.