ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక సమావేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక సమావేశం

Chandrababu Naidu and Pawan Kalyan key meeting concludes
  • చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశం
  • స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో చర్చలు
  • రెబల్స్ సమస్యను పరిష్కరించి, సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. సీఎం నివాసంలో సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమిలోని మూడు పార్టీల (టీడీపీ, జనసేన, బీజేపీ) మధ్య సీట్ల సర్దుబాటు, నామినేషన్ల అనంతరం క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై నేతలు సమీక్షించారు. ముఖ్యంగా, పలుచోట్ల రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటంతో వారిని బుజ్జగించి, నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా పోటీ నుంచి తప్పించేలా చూడాలని నిర్ణయించారు.

మిత్రపక్షాలు పూర్తి సమన్వయంతో ముందుకెళ్లాలని, ఎక్కడా ఎలాంటి విభేదాలకు తావివ్వకూడదని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసుకున్నారు. అదేవిధంగా, ఫేక్ వాట్సాప్ గ్రూపుల ద్వారా జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా వీరి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
Advertisement
Chandrababu Naidu
Pawan Kalyan
Andhra Pradesh Local Body Elections
TDP Janasena BJP Alliance
Supreme Court AP Elections
AP Political News

More Telugu News