తెలంగాణ గ్రూప్-3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ప్రకటన
- జూన్ 18 నుంచి జులై 8 వరకు ధ్రువపత్రాల పరిశీలన
- నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో గల సురవరం ప్రతాపరెడ్డి వర్శిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లతో పాటు వెరిఫికేషన్ కొరకు ఏయే సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లాలో ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన గ్రూప్ 3 అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచినట్లు టీజీపీఎస్‌సీ తెలిపింది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ స్వయంగా సంతకం చేసిన (సెల్ఫ్ అటెస్టెడ్) ఫోటో కాపీలు తీసుకురావాలని టీజీపీఎస్సీ తెలిపింది.