పాకిస్థాన్ తో యుద్దంలో ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పండి: రాహుల్ గాంధీ
- ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ కు సమాచారం అందించారన్న రాహుల్
- దీని వల్ల మన వైమానికి దళం ఎన్ని విమానాలో కోల్పోయిందో చెప్పాలని డిమాండ్
- రెండు రోజుల పోస్టుకు కొనసాగింపుగా తాజా ట్వీట్
ఆపరేషన్ సిందూర్ దాడి ప్రారంభానికి ముందే పాకిస్థాన్‌కు సమాచారం చేరవేయడం నేరమని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయంలో జైశంకర్ మౌనం వహించడం కేవలం సమాచారాన్ని వెల్లడించకపోవడం మాత్రమే కాదని, అది విపత్కర పరిణామం అని రాహుల్ తన పోస్టులో పేర్కొన్నారు. "మరోసారి అడుగుతున్నాను, పాకిస్థాన్‌కు ముందే సమాచారం తెలియడం వల్ల మనం ఎన్ని విమానాలు కోల్పోయాం?" అని జైశంకర్‌ను సూటిగా ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం చేసిన పోస్టుకు కొనసాగింపుగా ఈ తాజా ట్వీట్ చేశారు.