వృద్ధురాలిని చంపి.. మృతదేహంపై డ్యాన్స్.. బాలుడి పైశాచిక ఆనందం
- హైదరాబాద్లోని కుషాయిగూడలో దారుణం
- వృద్ధురాలి మెడకు చీర బిగించి చంపిన బాలుడు
- మృతదేహంపై నాట్యం చేస్తూ వీడియో చిత్రీకరణ
- బెంగళూరులో ఉన్న స్నేహితులకు వీడియో పంపిన నిందితుడు
- అక్కడికి పోలీసులకు అది చేరడంతో విషయం వెలుగులోకి
తనను ఎప్పుడూ కోపగించుకుంటుండటంతో కమలమ్మపై బాలుడు కక్ష పెంచుకున్నాడు. గత శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడి ఆమె మెడకు చీరను బిగించి హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని ఎక్కి తొక్కాడు. అప్పటికీ అతడి కోపం చల్లారకపోవడంతో మెడను తొక్కుతూ డ్యాన్స్ చేశాడు. దీనిని వీడియో తీసి బెంగళూరులోని తన స్నేహితులకు వాట్సాప్లో షేర్ చేశాడు. అక్కడా వీడియో వైరల్గా మారడంతో అక్కడి పోలీసులు ఆరా తీశారు.
ఈ ఘటన హైదరాబాద్లో జరిగినట్టు గుర్తించి రాచకొండ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హత్యకేసు వెలుగులోకి వచ్చింది. కుళ్లిన స్థితిలో ఉన్న కమలమ్మ మృతదేహాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడు తీసిన వీడియో బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఒంటరి కావడంతో ఆస్తి కోసం ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.