కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలు? క్లారిటీ ఇచ్చిన అధికారులు..!
- ‘సర్’ సహా అన్ని నిర్ణయాలూ ఏకగ్రీవంగానే తీసుకున్నామన్న ఈసీ
- ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు చెప్పారన్న వార్తలను ఖండించిన అధికారులు
- కొన్ని అంశాలపై వారు పరిశీలనలు మాత్రమే చేశారని వెల్లడి
- 14 సందర్భాల్లో అభ్యంతరాలంటూ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం
- ఓటర్ల జాబితా కచ్చితత్వమే ‘సర్’ లక్ష్యమని స్పష్టీకరణ
ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సహా ఎన్నికల సంఘం తీసుకున్న అన్ని నిర్ణయాలూ ఏకగ్రీవంగానే జరిగాయని ఈసీ స్పష్టం చేసింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలు నిర్ణయాలపై రికార్డులో అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. ఇద్దరు కమిషనర్లు కొన్ని అంశాలపై తమ అభిప్రాయాలను మాత్రమే వెల్లడించారని, వాటిని కమిషన్ పరిశీలించిందని పేర్కొంది.
ఇటీవల ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం.. గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొంది. తమకు సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, ఓటర్ల పేర్ల చేర్పు, తొలగింపు వంటి అంశాలపై వారు అభ్యంతరాలు తెలిపినట్లు కథనం పేర్కొంది. ఎన్నికల సంఘం మాత్రం ఈ వాదనలను ఖండించింది.
ఈసీ వర్గాల ప్రకారం.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకున్నారు. కమిషన్ తీసుకున్న నిర్ణయాలపై ముగ్గురి సంతకాలు ఉంటాయని తెలిపింది. కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే మెజారిటీ నిర్ణయం అమల్లోకి వస్తుందని నిబంధనలు చెబుతున్నాయి. అయితే ‘సర్’ సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయని ఈసీ స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈసీ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘సర్’ వల్ల కొందరి ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యే అవకాశం ఉందంటూ ప్రతిపక్ష నేతలు గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల జాబితా కచ్చితత్వం, సమగ్రతను నిర్ధారించేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ చెబుతోంది.