అమెరికా రోడ్ల కంటే మన రోడ్లను అందంగా తీర్చిదిద్దుతాం: నితిన్ గడ్కరీ
- దేశ అభివృద్ధిలో రోడ్లది కీలక పాత్ర అన్న నితిన్ గడ్కరీ
- రోడ్లు బాగున్న దేశం అభివృద్ది చెందుతుందని వ్యాఖ్య
- గత 11 ఏళ్లలో దేశ వ్యాప్తంగా ఎన్నో రహదారులు, ఫ్లైఓవర్లు నిర్మించామన్న గడ్కరీ
మన రోడ్లకు సంబంధించి తాను కేవలం హామీలు మాత్రమే ఇవ్వడం లేదని... చేసి చూపిస్తానని నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ రహదారుల బాధ్యతను తనకు అప్పగించారని... గత 11 ఏళ్లలో దేశ వ్యాప్తంగా ఎన్నో రహదారులు, ఫ్లైఓవర్లను నిర్మించామని చెప్పారు.