కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్
- పర్యావరణాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్న మీనాక్షి నటరాజన్
- మంత్రివర్గ కమిటీతో అన్ని అంశాలను చర్చిస్తున్నామని వెల్లడి
- అందరి వాదనలు విని ఏం చేయాలో ఆలోచిస్తామని వివరణ
అందరి వాదనలను పరగణనలోకి తీసుకుంటామని, ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని ఆమె వెల్లడించారు. ఎవరికీ నష్టం వాటిల్లకుండా వివాదాన్ని పరిష్కరించాలనేది తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తామని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణల్లోని వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.