Ram Charan: 'ఆర్‌సీ 16' నుంచి అదిరిపోయే అప్‌డేట్.. రేపు చెర్రీ బ‌ర్త్‌డే ట్రీట్!

RC16 First Look Out Tomorrow Ram Charans Birthday Special
షార్ట్స్‌లో చూడండి
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న 'ఆర్‌సీ 16' నుంచి అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. రేపు చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ ను ఉద‌యం 9.09 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు చెర్రీ "యుద్ధంలో నిర్భయుడు.. మనస్సులో కనికరం లేనివాడు. రేపు ఉద‌యం 9.09 గంట‌ల‌కు క‌లుద్దాం" అంటూ ట్వీట్ చేశారు. 

ఇక ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే శివ‌రాజ్ కుమార్, బాలీవుడ్ న‌టుడు దివ్యేందు, జ‌గ‌ప‌తి బాబు త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వెంకట సతీశ్‌ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
Go Back to Shorts
Ram Charan
RC16
Buchi Babu Sana
Janhvi Kapoor
Chiranjeevi
First Look
AR Rahman
Telugu Cinema
Movie Update
South Indian Cinema

More Telugu News