ఉద్యోగం కోసం పరీక్ష రాస్తుండగా పురుటి నొప్పులు.. ఆసుపత్రిలో ప్రసవం
--
టోంక్ జిల్లా మాల్ పురాలో గత నెల 28వ తేదీన పరీక్ష రాస్తున్న అభ్యర్థులలో ప్రియాంక చౌధరి అనే గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో అంబులెన్స్ పిలిపించి నిర్వాహకులు ప్రియాంకను టోంక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ సాధారణ ప్రసవం జరిగి, ప్రియాంక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పరీక్ష మరోసారి రాసుకోవచ్చు కానీ తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని ప్రియాంక భర్త జీత్‌రామ్ చౌధరి సంతోషం వ్యక్తం చేశారు.