పవన్ కల్యాణ్ పై అనుచిత పోస్టు.. కేసు నమోదు
- ఇటీవల కుంభమేళాకు వెళ్లిన పవన్ కల్యాణ్
- భార్య, కుమారుడితో కలిసి పుణ్యస్నానం చేసిన పవన్
- మరో నటుడు సంపూర్ణేశ్ బాబుతో పోలుస్తూ హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి పోస్ట్
వీరు పుణ్యస్నానాలు చేస్తున్న ఫొటోను మరో సినీనటుడు సంపూర్ణేశ్ బాబుతో పోలుస్తూ హర్షవర్ధన్ రెడ్డి ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై జనసైనికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేత రిషికేశ్ కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రిషికేశ్ ఫిర్యాదు మేరకు కావలి పోలీసులు కేసు నమోదు చేశారు.