‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసు..దిల్ రాజుకు కొనసాగనున్న ఊరట.. స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ
- రచయిత్రి శ్యామలారాణి వయసు రీత్యా చేసిన అభ్యర్థన తిరస్కరణ
- తన నవల ఆధారంగా సినిమా తీశారని 2017లో రచయిత్రి ఫిర్యాదు
- విచారణ కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రానికి సంబంధించిన కాపీరైట్ వివాదంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ వివాదానికి సంబంధించి దిల్ రాజుపై విచారణ ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోయింది.
ప్రభాస్ కథానాయకుడిగా 2011లో విడుదలైన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్ర కథను, తన నవల ‘నా మనసు కోరింది నిన్నే’ నుంచి కాపీ చేశారని రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని శ్యామలారాణి తరఫు న్యాయవాది ఇటీవల కోరారు. తన క్లయింట్ వయసు (71 ఏళ్లు) దృష్ట్యా విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. అయితే, ఈ అభ్యర్థనను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్టే విధించామని స్పష్టం చేస్తూ విచారణను ముగించింది.
2010లో ప్రచురితమైన తన నవల ఆధారంగానే ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాను తెరకెక్కించారని ఆరోపిస్తూ శ్యామలారాణి 2017లో దిల్ రాజుపై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైదరాబాద్‌లోని ట్రయల్ కోర్టు.. ఐపీసీ సెక్షన్ 420, కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ దిల్ రాజు హైకోర్టును ఆశ్రయించగా.. సెక్షన్ 420ని కొట్టివేసిన న్యాయస్థానం, కాపీరైట్ చట్టం కింద విచారణను కొనసాగించవచ్చని 2024 డిసెంబర్‌లో తీర్పునిచ్చింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దిల్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై 2025 ఫిబ్రవరిలో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో పాటు ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేయడానికి నిరాకరించడంతో ఈ కేసులో దిల్ రాజుకు ఊరట కొనసాగనుంది.