దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా నా వ్యక్తిగత అంశం: పవన్ కల్యాణ్
- దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు బయల్దేరిన పవన్
- కేరళలోని అగస్త్య ఆలయం సందర్శన
- తన తాజా పర్యటనకు రాజకీయాలతో సంబంధంలేదని స్పష్టీకరణ
తన తాజా పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. ఇది వ్యక్తిగత పర్యటన అని, నాలుగున్నరేళ్ల కిందట చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసం ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తన ఆరోగ్యం సహకరించకున్నా వచ్చానని తెలిపారు.
కాగా, ఈ ఆధ్యాత్మిక పర్యటనలో పవన్ వెంట ఆయన తనయుడు అకిరా నందన్, సన్నిహితుడు, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు.