కర్ణాటక రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన
- సింధనూరు వద్ద వాహనం బోల్తా
- నలుగురి మృతి
- మృతుల్లో ముగ్గురు వేద విద్యార్థులు
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు హంపిలో ఆరాధనోత్సవానికి వెళుతూ ఈ ప్రమాదానికి గురయ్యారని తెలిసిందని వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని... మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.