ఈ సినిమా ద్వారా బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ ఇదే: అనిల్ రావిపూడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ సినిమా ద్వారా బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ ఇదే: అనిల్ రావిపూడి

anil ravipudi about Sankrantiki Vastunnam
  • నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం
  • పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందంలో జోష్
  • సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్
విక్టరీ వెంకటేశ్ హీరోగా, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. పేరుకు తగ్గట్టుగానే ఈ చిత్రం నిన్న సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 

ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. హీరో వెంకటేశ్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీశ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఫస్ట్ టైం ఉదయం నాలుగున్నర షోలకి కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ రావడం తమకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. 
 
“ బేసికల్లీ,  టెక్నికల్లీ, కలర్ ఫుల్లీ, హౌస్ ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్. తెలుగు ప్రేక్షకులందరికీ బిగ్ థాంక్స్. మామూలుగా బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్, యూత్ వెళ్తుంటారు. మొదటిసారి ఉదయం నాలుగున్నర షోలకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ రావడం ఈ సినిమా ద్వారా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాకు. థియేటర్లలో ప్యాక్డ్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్స్. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకున్నాం. వెంకటేశ్ కి ఫ్యామిలీస్‌లో ఉన్న ఫాలోయింగ్ ఏమిటో మనందరికీ తెలుసు. ఈసారి కరెక్ట్‌గా పొంగల్‌కి కుదిరింది, ఇది వెంకీ సార్ పొంగల్. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ” అని రావిపూడి పేర్కొన్నారు. 
Advertisement
Sankrantiki Vastunnam
anil ravipudi
Movie News

More Telugu News