భారత మార్కెట్‌లోకి మరో ‘వన్‌ప్లస్’ స్మార్ట్‌ఫోన్.. ధర, ఇతర వివరాలు ఇవే

భారత మార్కెట్‌లోకి మరో ‘వన్‌ప్లస్’ స్మార్ట్‌ఫోన్.. ధర, ఇతర వివరాలు ఇవే

OnePlus 13 series India launch on 7 January
  • జనవరి 7న విడుదల కానున్న వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్
  • ఇప్పటికే చైనాలో విడుదలైన ఆదరణ పొందిన ఫోన్లు
  • ‘వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3’ను కూడా విడుదల చేయనున్న వన్‌ప్లస్
స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ భారత మార్కెట్‌లో మరో కొత్త మొబైల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. జనవరి 7న జరగనున్న కంపెనీ ‘వింటర్ ఈవెంట్‌’లో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్లను విడుదల చేయనుంది. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్లకు చక్కటి ఆదరణ లభించింది. ప్రీమియం కేటగిరీకి చెందిన ఈ ఫోన్ల ధర రూ.67,000 నుంచి రూ. 70,000 వరకు ఉండొచ్చని అంచనాగా ఉంది. 

వన్‌ప్లస్ 13 ఫీచర్ల విషయానికి వస్తే... 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల డిస్‌ప్లే, సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ తయారైంది. చక్కటి ఫొటోగ్రఫీ అనుభూతి కోసం ఫోన్ ముందు, వెనుక భాగాల్లో అద్భుతమైన కెమెరా సెటప్‌లు ఉన్నాయి. ఫొటోలను జూమ్ చేసుకునే సామర్థ్యాల కోసం టెలిఫోటో లెన్స్‌ను కూడా కంపెనీ అందించింది.

6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది. మరోవైపు, ఇదే వేదికపై సరికొత్త సాంకేతికతతో తయారైన ‘వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3’ను కూడా జనవరి 7న కంపెనీ విడుదల చేయనుంది. హార్డ్‌వేర్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో రానుంది. 
Advertisement
OnePlus 13
Smart Phones
Tech-News

More Telugu News