వింటేజ్ ర‌మ‌ణ గోగుల‌ను గుర్తు చేశారుగా... స్పెష‌ల్ వీడియో పంచుకున్న అనిల్ రావిపూడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వింటేజ్ ర‌మ‌ణ గోగుల‌ను గుర్తు చేశారుగా... స్పెష‌ల్ వీడియో పంచుకున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi Tweet on Ramana Gogula
  • వెంక‌టేశ్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో 'సంక్రాంతికి వ‌స్తున్నాం'
  • 2025 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న‌ సినిమా
  • ఈ మూవీలో సంగీత ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ గోగుల సింగ‌ర్‌గా రీఎంట్రీ 
  • ఆయ‌న పాట పాడిన వీడియోను పంచుకున్న అనిల్‌
విక్ట‌రీ వెంక‌టేశ్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'సంక్రాంతికి వ‌స్తున్నాం'. 2025 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ఈ సినిమా విడుద‌ల కానుంది. అయితే, ఈ మూవీలో సంగీత ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ గోగుల సింగ‌ర్‌గా రీఎంట్రీ ఇస్తున్నారు. 'గోదారి గట్టుమీద చంద‌మామ‌వే' అంటూ సాగే పాట‌ను ఆయ‌న త‌న‌దైన హ‌స్కీ గొంతుతో పాడారు. 

ఈ సంద‌ర్భంగా త‌న తొలి సినిమాకు వెంకీనే హీరో అని, ఇప్పుడు ఆయ‌న మూవీలోనే పాట పాడిన‌ట్లు ర‌మ‌ణ గోగుల గుర్తు చేశారు. ఆయ‌న పాడుతున్న వీడియోను ద‌ర్శ‌కుడు అనిల్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా పంచుకున్నారు. ర‌మ‌ణ గోగుల, మ‌ధు ప్రియ‌ గాత్రం గోదారి గట్టు పాట‌కు ప్రాణం పోశాయ‌ని అన్నారు. ఈ సాంగ్‌ను అందంగా స్వ‌ర‌ప‌రిచిన భీమ్స్, అంతే అంద‌మైన‌ సాహిత్యాన్ని అందించిన భాస్కరభట్లను అనిల్ రావిపూడి ప్ర‌శంసించారు. 

ఇక అనిల్ షేర్ చేసిన వీడియో చూసిన అభిమానులు 'వింటేజ్ ర‌మ‌ణ గోగుల' గుర్తొస్తున్నార‌ని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ పాట లిరిక‌ల్ వీడియో డిసెంబ‌ర్ 3న విడుద‌ల కానుంది.  
Advertisement
Anil Ravipudi
Ramana Gogula
Tollywood
Godari Gattu

More Telugu News