ఆస‌క్తిక‌రంగా అజిత్ కుమార్ 'విడముయార్చి' మూవీ టీజర్

Ajith Kumar Vidaamuyarchi Teaser Released
  • అజిత్ కుమార్, మగిజ్ తిరుమేని కాంబోలో విడముయార్చి
  • 2025 పొంగ‌ల్ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు సినిమా
  • హీరోయిన్‌గా త్రిష.. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో అర్జున్‌, రెజీనా 
  • అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, మగిజ్ తిరుమేని కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'విడముయార్చి'. ఈ మూవీ టీజర్‌ను తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు. థ్రిల్లింగ్ అంశాల‌తో టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 పొంగ‌ల్ సంద‌ర్భంగా విడుద‌ల కానుంది. అజిత్ కుమార్‌తో మ‌రోసారి త్రిషాకృష్ణ‌న్‌ జ‌త క‌డుతున్న‌ ఈ మూవీలో ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో సీనియ‌ర్ యాక్ట‌ర్ అర్జున్‌, హీరోయిన్ రెజీనా క‌సాండ్రా న‌టిస్తున్నారు. అలాగే యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ బాణీలు అందిస్తున్నారు. 

Go Back to Shorts
Vidaamuyarchi Teaser
Ajith Kumar
Trisha
Kollywood

More Telugu News