Nara Rohit: నారా రోహిత్ కు బ్రెజిల్ నుంచి లేఖ రాసిన మోదీ

Modi writes letter to Nara Rohit
షార్ట్స్‌లో చూడండి
తన తండ్రి రామ్మూర్తినాయుడుని కోల్పోయిన సినీ నటుడు నారా రోహిత్ కు ప్రధాని మోదీ సంతాపాన్ని తెలియజేశారు. ప్రస్తుతం బ్రెజిల్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి నుంచి రోహిత్ కు లేఖ రాశారు. రామ్మూర్తినాయుడి మరణవార్త తెలిసి చాలా బాధకు గురయ్యానని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. ఆయన లేని లోటును భర్తీ చేయలేమని చెప్పారు. 

ప్రజాప్రతినిధిగా సామాన్య ప్రజల సమస్యలు, ఆకాంక్షలపై రామ్మూర్తి గళం వినిపించారని ప్రధాని కొనియాడారు. ఆయన చేసిన సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ఆయన భౌతికంగా దూరమైనా... అందరి హృదయాల్లో ఆయన నిలిచే ఉంటారని అన్నారు. మీకు, మీ కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ కష్ట కాలంలో మీకు మరింత శక్తిని అందించాలని భగవంతుడిని కోరుతున్నానని తెలిపారు.
Go Back to Shorts
Nara Rohit
Narendra Modi
BJP

More Telugu News